సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పచ్చిమగోదావరి జిల్లా,ఏలూరు వారాహి యాత్రలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. ఇన్ని వ్యవస్థలు ఉండగా, జగన్ సర్కార్ వాలంటీర్లకు 5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారని, ప్రతి ఇంటి కుటుంబ విషయాలు డేటా అంతా వాలంటీర్లకి తెలుసన్నారు. ఒంటరి అమ్మాయిల డాటా వాలంటీర్లు బయట ముఠాలకు చేరవేయడం వల్ల 30వేల మంది మిస్సింగ్ అయ్యారని ఆరోపణ చేసారు. వాలంటర్స్ 5లక్షలు ఉంటె ఏమిటి? నా సైనికులకు చిటికెనవేలు ఊపితే చాలు.. ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసారు. పవన్ కళ్యాణ్‌పై నిన్న విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ పై సెక్షన్ 153, 153A, 505(2) IPC సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.సెక్షన్ 153 ప్రకారం పవన్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది. 153 A కింద , రెండు కులాల మధ్య విద్వేషాలుకు అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినప్పటికీ కావాలని సమాజంలో గొడవలు రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో మాట్లాడారన్న అంశంపై మరో సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది.
