సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా తన కుప్పం నియోజకవర్గ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు తాజగా జరిపిన సమావేశంలో తొలిసారి ..నిజం నిష్ఠురమైన అసలు వాస్తవాలు అర్ధం చేసుకొని అధికార వైసిపి అసలు బలాన్ని అర్ధం చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేసారు.. చంద్రబాబు కుప్పంలో టీడీపీ నాయకుల ను ఉద్దేశించి …‘‘మిమ్మల్ని నమ్ముకొని నా పరువు పోగొట్టుకున్నా. నేను వచ్చినప్పుడు నాయకులు షో చేస్తున్నారే తప్ప మీరు ప్రజల్లో ఉండటం లేదు. మీ చేష్టల వల్లే ప్రజలు మనకు దూరమవుతున్నారు అని హెచ్చరించారు. ఇకముందు, ప్రజల్లో ఉన్న నాయకులనే నేను ప్రోత్సహిస్తా. పర్సనల్ ఎజెండాలతో పార్టీకి నష్టం చేయవద్దు. కుప్పంలో పార్టీలోకి యువత రాకుండా మన పార్టీ సీనియర్లు అడ్డుకుంటున్నారు. ముప్పై అయిదేళ్లుగా మిమ్మల్నే చూస్తున్నా.. కొత్త మొహాలే కనపడటం లేదు. వంద ఓటర్లకు ఒక యూత్ పర్సన్ ని ఏర్పాటు చేస్తాం. వాలంటీర్లకి పోటీగా సేవా మిత్రలను ఏర్పాటు చేద్దాం. అధికారంలోకి వచ్చాక వాళ్లనే వాలెంటీర్లుగా మారుద్దాం.. వారిని ప్రోత్సహిద్దాం అంటూ ’’ చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం..
