సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు నేడు, శనివారం భీమవరం వచ్చి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఆయన తండ్రి దివంగత నేత మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను, సోదరులు, బాలాజీ, చల్లారావు మరియు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒకనాటి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా దశాబ్దాలుగా భీమవరం నుండి చక్రం త్రిప్పిన రాజకీయ దురంధరుడు, ప్రజలకు సేవ చేసిన వైసీపీ సీనియర్ నేత గ్రంధి వెంకటేశ్వర రావు మృతి అందరికి తీరని లోటని , ఈ కష్ట సమయం నుండి గ్రంధి శ్రీనివాస్ అయన కుటుంబసభ్యులు త్వరగా కోలుకోవాలని అన్నారు.
