సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఒక ప్రక్క ఉత్తర భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, అనుకున్న షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరగానికి దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నేడు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్ను ప్రకటించింది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఏడు దశలు, మణిపూర్లో రెండు దశలు, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 14న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. కేవలం ఉత్తర ప్రదేశ్ లో మాత్రమే తొలి దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి – 10 న ప్రారంభమై విడతల వారీగా ఎన్నికలు జరుగుతాయి. చివరిదయిన 7వ విడుత మార్చి 7న ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎన్నికల ఆఫీసర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఎన్నిలలలో పోటీచేసే అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కలిపిస్తామన్నారు.
