సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, శనివారం భీమవరం పరిసర గ్రామాలలో హర్యానా రాష్ట్ర గవర్నర్, బండారు దత్తాత్రేయ పర్యటించారు. ఆయనతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా పాలకోడేరు మండలంలోని మోగల్లు లో పర్యటించి అక్కడ సభలో మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్యం వచ్చి 75సం వత్సరాలు గడిచిన నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలకు నాంది పలికారు ఆజాదీకా అమృత మహోత్సవ సందర్భంగా మహనీయులు స్మరణ చేసుకోవాలి , దీనిలో భాగంగా మన తెలుగువాడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వగ్రామం మోగల్లు రావడం అదృష్టం గా భావిస్తున్నాను. అక్కడ అల్లూరి సీతారామ రాజు గృహం ఉన్న ప్రాంతాలను సందర్శించి , అల్లూరి వారసులను యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి స్మారకంగా ఇక్కడ అభివృద్ధి కి సహకరిస్తానన్నారు. ఇక భీమవరం శివారు పెద్దమిరంలో జరుగుతున్నా అంతర్జాతీయ తెలుగు మహాసభలలో నేటి ముఖ్యఅతిధిగా హాజరయి గజమాలతో ఘన సన్మానం అందుకొన్నారు. దేశంలో అతిపురాతనమైన బాషా తెలుగు బాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎందరో మహామహులకు, ఇక్కడ తెలుగు వేడుకలు చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.A

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *