సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల కోట్ల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. మన దేశంలో 7 రోజుల క్రితం వరకు రోజుకు వందల్లో ఉన్న పాజిటివ్ కేసులు ఇప్పుడు లక్షన్నర దాకా వచ్చాయి. కేసుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతఏడాది బీభత్సం సృష్టించిన పాత కరోనా డెల్టా వేరియంట్ కు ఇప్పుడు విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మధ్య తేడాలు, ప్రభావాలపై అమెరికాలోని క్లీవ్ల్యాండ్కు చెందిన కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ విస్తృత పరిశోధన చేసింది..సాధారణంగా కరోనా వైరస్ మొదట ముక్కు, నోరు ద్వారా గొంతులోకి చేరి.. తర్వాత ఊపిరితిత్తులకు విస్తరిస్తుంది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంటుంది. అలాగే లోడ్ గొంతులో 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అదే ఊపిరితిత్తుల్లో మాత్రం 10 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇదే బాధితులకు పెద్ద ఊరట.. ఒమిక్రాన్ గొంతులో ఎంత ఎక్కువగా ఉన్నా.. ఊపిరితిత్తుల్లోకి చేరే లోడ్ తక్కువగా ఉండటం ప్రాణహాని తక్కువ అని వారు చెప్తున్నారు. 60 ఏళ్లలోపు వారిలో ఒమిక్రాన్ ప్రభావం తక్కువగానే ఉన్నా.. 60–65 ఏళ్లుపైబడిన వారికి, రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారికి మాత్రం ప్రమాదకరమేనని పరిశోధనలో గుర్తించారు. ప్రజలు తప్పని సరిగా మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించడం మంచిది.
