సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం విజవాడలోని గన్నవరం విమానాశ్రయం వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వగతం పలికారు. అటునుంచి అయన కాన్వాయి తో ఖమ్మం చేరుకొని “రైతు ఘోష – బీజేపీ భరోసా’ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలి. కాంగ్రెస్, BRS.. రెండూ కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ సోనియా కుటుంబం కోసం పనిచేస్తుంటే.. BRS కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోంది. కారు స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉంది. ఓవైసీతో కలిసి తెలంగాణ పోరాటయోధులను విస్మరించారు. తెలంగాణ అమరుల కలను బీఆర్ఎస్ నాశనం చేసింది. కెసిఆర్ గుర్తుంచుకో.. ఇక నీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతుంది. తెలంగాణలో త్వరలోనే కమలం వికసిస్తుంది.” అని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు.”కాంగ్రెస్ 4జీ పార్టీ, BRS 2జీ పార్టీ, MIM 3జీ పార్టీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోదీజీ పార్టీనే. అరెస్ట్‌లతో BJP నేతలను భయపెట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరు. ఈసారి సీఎం అయ్యేది బీజేపీ నేత మాత్రమే.అన్నారు,
