సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి .. వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు.. తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. గిడుగు వారి జన్మ దినాన్ని పురస్క రించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.
