సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా పంటలకు , సముద్ర తీరా ప్రాంత మత్య సంపద ఉత్పత్తులకు, చేపలు, రొయ్యలు ఎగుమతులతో దేశంలోనే ఈ ప్రాంతం అగ్రస్థానం వహిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో రాష్ట్రంలో మొదటిసారిగా.. దేశంలో 3వ ఆక్వా యూనివర్సిటీ.. నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా యూనివర్సిటీ లో ఈ ఏడాది విద్యాసంవత్సరం ఈ 60 సీట్లతో విద్యార్థులకు ప్రారంభం కానుంది. నర్సాపురంలోని సరిపల్లి– లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల విస్తీర్ణం లో రూ.303 కోట్ల వ్యయంతో మత్స్య విశ్వ విద్యాలయ పనులు మొదలయ్యాయి. మొదటి దశలో రూ.100 కోట్లు కేటాయించడంతో గతేడాది ఫిబ్రవరిలో విశ్వ విద్యాలయం కార్య కలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ నర్సాపురంలో ఫిషరీస్యూనివర్సిటీ 60 సీట్లతో ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఇందులో చదువుకొనే విద్యార్థులకు నూరు శాతం ఉపాధి అవకాశాలు దేశీయ, విదేశీ ఆక్వా కంపెనీల్లోమెరుగైన అవకాశాలు ఉంటాయి. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జారుతుంది. ఫిషరీస్ లో 1. ఫిషరీస్ డిప్లమో కోర్సు 2. ఫిషరీస్ గ్రాడ్యు యేషన్లో బ్యాచ్లర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ) నాలుగేళ్ల కాలపరిమితితో కూడిన కోర్సు ఉంటాయి. ఉండి బలభద్రపురంలో రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి.
