సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 58వ జాతర మహోత్సవాలను ఈనెల 13వ తేదీ నుంచి పిబ్రవరి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ తెలిపారు. నేడు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం అమ్మవారి గ్రామోత్సవం, సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామలచే ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది సుమారు రూ కోటి వ్యయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 30వ తేదీన సినీనటుడు జెడి చక్రవర్తిని సువర్ణ హస్త భరణంతో సత్కరిస్తున్నామని, అదే విధంగా ప్రతి ఏడాది మాదిరిగానే 23 పౌరాణిక నాటకాలు, 6 బుర్రకథలు, 6 హరికథలు, 6 సంగీత విభావరి, 6 మ్యూజికల్ నైట్స్, 12 కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నమని తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. అనంతరం ఉత్సవాల బ్రొచర్ ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు కొప్పుల సత్తిబాబు, రామాయణం గోవిందరావు, రామాయణం సత్యనారాయణ, కొప్పుల రంగారావు, మానే భాస్కర రావు, కట్టా కొండ, రామాయణం శ్రీనివాసరావు, భాస్కర రావు, మానే తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *