సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ ఓట్ల రాజకీయం చాల నీచంగా ఉందని .. టీడీపీ వారు భీమవరం నియోజకవర్గంలో, వైసిపి మద్దతు దారుల సానుభూతిపరుల ఓట్ల జాబితా నుంచి తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యా దు చేశారని . ఆఖరికి నా కన్నతల్లి బ్రతికుండగానే ఆమె మరణించినట్లు దొంగఓటుగా వారు లిస్ట్ చేసారని, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియా ఛానెల్స్ లో చేసిన వ్యాక్యలు తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీడీపీ ఆధ్వర్యం లో ఎన్నికల సంఘానికి భీమవరంలో 10 వేల ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించాలని కోరుతూ ఇచ్చిన జాబితాను తాము సమాచార చట్టం ద్వారా తెప్పించి ఆ లిస్ట్ పరిశీలించగా( ఆధారాలు చూపుతూ..) దీనిలో తన తల్లి గ్రంధి వెంకటరత్నంతో పాటు భీమవరంలో 2 సారులు శాసన సభ్యునిగా పోటీ చేసిన డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, నాచు శేషగిరిరావు తదితరు పెద్దల పేర్లు ఉన్నాయన్నారు. వీరందరూ పెద్ద వయస్సు వారు జీవించే ఉన్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే .. తన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు మరణించగా ఆయన పేరు మాత్రం ఓటు లిస్ట్ నుండి తొలగించాలని కోరలేదన్నారు. ఇదంతా టీడీపీ కి ఉన్న ఓటమి భయంతో ఒక ప్యూహం ప్రకారం జరిగిందని ఆరోపించారు.
