సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన దర్పం వదిలేసి..రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక మార్గంలో సామాన్య వ్యక్తిగా జీవితం గడుపుతున్న మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఇటీవల కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుపై సీడబ్ల్యూ సీ సభ్యులు రఘువీరారెడ్డి నేడు, శుక్రవారం మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వీయ తప్పిదాల కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లారని తాను త్రవ్విన గోతిలో తానే పడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం 2017లో గుంటూరులో తాను కాంగ్రెస్ తరపున సభ నిర్వహిస్తే చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించారు. ఆయన అవినీతి చెయ్యకపోతే భయం ఎందుకు ? కోర్టులో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి. అంతే కానీ టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నా ఉద్దేశ్యం ప్రకారం చంద్రబాబు జైలు నుంచి విడుదల కాలేరు. అని సంచలన వ్యాక్యలు చేసారు.
