సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంచలనం కలిగించిన అత్యంత కిరాతకమైన హత్య కేసు.. భీమవరం లెప్రసీ కాలనీలో ములుకు రత్న కుమారి (12) హత్య కేసులో.. ముందుగా అనుమానించినట్లే.. నిందితుడు వరుసకు బాబాయ్అయిన ములుకు శివ (మావుళ్లు)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ,.రవిప్రకాష్ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆయన మాటలలో.. లెప్రసీ కాలనీలో నివాసముంటున్న ములుకు అంజి, దుర్గదంపతుల కుమారై రత్న కుమారి అనే బాలిక అదృశ్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఈ నెల 28న బాలిక మృతదేహం వారి ఇంటి వెనుక గల జమ్ము గడ్డి తోటలో కనిపించడంతో అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేపట్టారని ఎస్పీ వివరించారు. ఆ దర్యాప్తులో అనుమానితుడు.. బాలికను హత్య చేసిన మృతురాలికి వరుసకు బాబాయి అయిన మావుళ్లు తనపై బాలిక బంధువులు దాడి చేస్తారనే భయంతో గత శుక్రవారం సాయంత్రం డిప్యూటీ తహసీల్దార్ గ్రంధి పవన్ కుమార్ వద్ద లొంగిపోయి బాలిక మరణానికి తానే కారణమని స్వయంగా ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు. దీంతో మావుళ్లును అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే బాలిక ఎలా మృతి చెందిదనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తెలియాల్సిఉందన్నా రు. ఈ కేసును త్వరగా కొలిక్కి తెచ్చిన డీఎస్పీ మురళీకృష్ణ, భీమవరం డీఎస్పీ బండారు శ్రీనాధ్, 1 town సీఐ అడబాల శ్రీను, ఎస్ఐ, ఎం .వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
