సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ కు గురయ్యాడు. కాగా, శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక, స్కిల్ కుంభకోణం కేసు, కేంద్ర ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు కీలకంగా ఉండటం గమనార్హం. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు స్కాములో నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లోపేర్కొంది. అయితే సీఐడీ దర్యాప్తు కు సహకరించకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు వెళ్లిపోయారు.. ఈ క్రమంలో శుక్రవారం లోగా తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చి నా శ్రీనివాస్ వెనక్కి రాలేదు. ఈ నేపథ్యం లో శ్రీనివాస్పై సస్పెన్షన్ విధించారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడుగా పేరున్న కిలారి రాజేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయిన విషయం ఇక్కడ గమనార్హం. పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేష్ లపై సీఐడీ విచారణ జరిగితే ఈ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
