సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఇంటింటికి ఆరోగ్యం చేరాలని ప్రతి ఇంటా కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్యం లేకుండా వైద్యసేవలు ఉచితంగా అందివ్వాలన్న లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వర్చువల్ గా ప్రారంభించిన నేపథ్యంలో నేడు, శనివారం భీమవరం తాడేరు గ్రామంలో, మరియు PSM గర్ల్స్ హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున పందిళ్లు వేసి ఏర్పాటు చేసిన జగనన్న “ఆరోగ్య సురక్ష” కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని అనారోగ్యంతో వివిధ ఆరోగ్య సమస్యలతో అక్కడికి వచ్చిన ప్రజల కు వారి సమస్యలను అడిగి తెలుస్తుకొన్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అందరిని తన కుటుంబంగా భావించి వారి ఆరోగ్యం బాగోగులు చూడటానికి వాలంటర్స్ సహకారంతో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయిపట్టుకుని నడిపించే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష’ ఏర్పాటు చేసారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల, ప్రభుత్వ వైద్య సిబ్బంది , సచివాలయాలు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు , వైసిపి నేతలు పాల్గొన్నారు.
