సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం, ప్రతిష్టాకర భీమవరం పట్టణం అధికార వైసిపి పార్టీ అధ్యక్షుడిగా తోట బోగయ్యను నియమించినట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో వైసిపి నేతలు విశేషంగా తోట బోగయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే భీమవరం మండలం అధ్యక్షుడిగా తిరుమణి ఏడుకొండలు, వీరవాసరం మండల పార్టీ అధ్యక్షుడిగా కడలి ధర్మారావు ఎన్నికయినట్లు అధిష్టానం సీఎం జగన్ నుండి ఆదేశాలు వచ్చాయని వారికీ అబినందనాలు తెలుపుతున్నానని, పార్టీ ప్రతిష్ట కోసం వారు మరింత కృషి చెయ్యాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమం లో భీమవరం ఎంపీపీ వెంకట నరసింహరాజు, బిసి బోర్డు డైరెక్టర్ కామన నాగేశ్వర రావు తదితరులు పాల్గొని వారికీ అభినందనలు తెలిపారు.
