సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం పట్టణంలోని లోని ప్రకాష్ నగర్ ఎస్టి కాలనీ మెయిన్ రోడ్ ను కలుపుతూ 66 లక్షల 20 వేల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతన సి సి రోడ్డు వేయుటకు గాను శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక మహిళలను అడిగి వారి సమస్యలు తెలుసుకొన్నారు. సీఎం జగన్ సహకారంతో భీమవరంలో ఇంకా పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంతో పూర్తీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల, భీమవరం ఎంపీపీ పి నరసింహరాజు పట్టణ వైసిపి అడ్జక్షులు తోట బోగయ్య మాజీ కౌన్సెలర్స్ ,తదితర వైసిపి నేతలు పాల్గొన్నారు.
