సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబుకు ఆరోగ్యం విషమించిందని, టీడీపీ చేస్తున్న విష ప్రచారం పచ్చి బూటకమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామకృ ష్ణారెడ్డి తీవ్రస్థాయిలోఆగ్రహం వ్యక్తం చేసారు. భువనేశ్వరి, బాలకృష్ణ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన నేడు, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వాళ్ళు ఏమనుకొంటున్నారు. జైలు ఏమైనా అత్తగారిల్లా? ఏసీలు పెట్టాలా? అని ఆయన ప్రశ్నిం చారు. ప్రజా ధనం దోచేసి అవినీతి కేసులలో చంద్రబాబు అరెస్ట్ అయితే .. ఆయన రక్షణ కోసం స్నేహ బ్యారెక్ మొత్తం ఖాళీ చేసి చం ద్రబాబు కోసమే కేటాయించామన్నారు. బాబు ఆరోగ్యం విషమించిందని ప్రచారం పరాకాష్టకు చేరిందనిఅన్నారు. ఇప్పుడేమో ప్రభుత్వం స్టెరాయిడ్స్ఇవ్వాలని ప్రయత్నిస్తోందని లోకేశ్ ట్వీట్ చేశారని ఆగ్రహం వ్య క్తం చేశారు. నిజానికి చంద్రబాబు జైల్లో ఒక కిలో బరువు పెరిగారన్నారు. భువనేశ్వరి చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారని ప్రచారం చేస్తున్నారంటే.. ఆయన భార్య భోజనం లో ఏం కలుపుతున్నారో? అని అనుమానం వ్య క్తం చేశారు. ఇంటి దగ్గరి నుండి తెచ్చే భోజనం లో ఏమైనా కలిపి అనారోగ్యానికి గురయ్యేలా చేసే అవకాశం వుందని ఆయన సందేహపడ్డారు. అందుకే ఇకపై ఇంటి దగ్గరి నుంచి తెచ్చే భోజనాన్ని కూడా పరీక్షిస్తున్నారని సజ్జల తెలిపారు.
