సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో సీపీఎం, సీపీఐ,ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో వామపక్ష నేతలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ కరపత్రాల పంపిణీ,సంతకాలు సేకరణ నిర్వహించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఇటీవల ఏపీలో ప్రజలపై మోయలేని భారంగా పరిణమించిన వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని,లేని పక్షంలో మరో బషీర్ బాగ్ లాంటి విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, పీక్ టైం ఛార్జీలు, పెనాల్టీల రూపంలో రాష్ట్రంలో ప్రజలను విద్యుత్ ఛార్జీలతో వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు,రైతుల వ్యవసాయ మోటార్లు మీటర్లు బిగించే యోచన విరమించుకోవాలని కోరారు. గృహ వినియోగంతో సహా కమర్షియల్, వ్యవసాయ కేటగిరీలపై పెనుభారం పడిందని విమర్శించారు.జగన్ హయంలో నెల నెలా వినియోగదారులకు వాతలు పడ్తున్నాయని వీటిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈకార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.ఎన్.వి గోపాలన్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాం ప్రసాద్, సిపిఎం నాయకులు బి.వాసుదేవరావు, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, దండు శ్రీనివాసరాజు, కొత్తపల్లి సుబ్బరాజు, వాటాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
