సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్‌పై ఢిల్లీలో లోకేష్ ను తీసుకోని అమిత్ షా ను కలసిన నేపథ్యంపై బీజేపీ ఏపీ అడ్జక్షురాలు పురందేశ్వరి నేడు, శనివారం మీడియా వేదికగా ఆచితూచి స్పందించారు. లోకేష్ ను అమిత్ షా పిలిపించారా ? అన్న మీడియా ప్రశ్న కు అది అప్రస్తుతం.. చంద్రబాబు కు జైల్లో భద్రతా కోసం అమిత్ షా తో లోకేష్ భేటీ జరిగిందన్నది వాస్తవం.. అన్నారు. ‘చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో అవినీతి చేసారా? లేదా?వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులే. అని ఆమె అన్నారు. ‘గోదావరి జలాలను పెన్నాతో లింక్ చేసే ప్రాజెక్టును గత ప్రభుత్వం.. ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం గోదావరి-పెన్నా ప్రాజెక్టు డీపీఆర్ చూపించి రూ. 2 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఇది దారుణం కాదా..?. గతంలో ఏదైనా ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ వేయించారు.. ఇప్పుడు సీఎం మీద వస్తున్న ఆరోపణల మీద జగన్ సీబీఐ విచారణ చేయించగలరా..?’ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని ప్రభుత్వాన్ని మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *