సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టౌన్ హాలులో నేడు, ఆదివారం జరిగిన ఏపీ మునిసిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలలో ..ఏపీ రాష్ట్ర అడ్జక్షుడు గా భీమవరం పట్టణానికి చెందిన ఎస్ కృష్ణమోహన్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వందలాదిగా రాష్ట్ర స్థాయి మున్సిపల్ ఉద్యోగ నాయకుల హాజరు అయ్యి సర్వసభ్య సమావేశం లో తమ సమస్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి త్వరలో తమ సమస్యలను తీసుకొనివెళ్ళాలని తీర్మానించారు. తొలిసారి అమరావతిలో కాకుండా భీమవరంలో నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరగటం హర్షణీయం అన్నారు. దీనికి రాష్ట్ర స్థాయిలో నేతలే కాకుండా తెలంగాణ నుండి కూడా మున్సిపల్ ఉద్యోగ సంఘ నేతలు పలువురు ఆహ్వానితులుగా హాజరు కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *