సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థులకు ఉద్యోగులకు దసరా సెలవులు మొదలు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని రైల్వే, బస్సు స్టేషన్స్ లలో కుటుంబాలతో దూరప్రాంతాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్, తిరుపతి లాంటి నగరాలకు 2 నెలల క్రితమే రైల్వే రిజర్వేషన్ పూర్తీయిపోయింది. ఇదే మంచి సీజన్ సమయం కావడంతో కొందరు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహించే వాహనాలకు బస్సులకు గతం కంటే రెట్టింపు చార్జీలు వసూళ్లు చెయ్యడం తో ప్రయాణికులకు అదనపు బాదుడు తప్పడం లేదు. ప్రభుత్వ అధికారులు ధరలు అదుపుకు చర్యలు తీసుకోవాలని చూసి చూడనట్లు వ్యవహరిస్తే తాము నష్టపోతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోల నుంచి మొత్తం రెగ్యులర్ సర్వీసుల తో పాటు హైదరాబాద్ వెళ్ళడానికి 35 బస్సులు అదనంగా నడుపుతున్నారు. వీటిలో సింహ భాగం బీమవరం నుండే కేటాయించారు. భీమవరం, తాడేపల్లి గూడెం మీదుగా రైల్వే కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
