సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శుక్రవారం స్థానిక మెంటేవారి తోటలోని 2వ వార్డు లో గల వండర్ కిడ్స్ స్కూల్, మరియు 25 వ వార్డు లో గల శ్రీ కృష్ణ దేవరాయ కళ్యాణ మండపం నందు జరిగిన “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమం జరిగింది. 2వ వార్డులో 805 మంది, 25 వ వార్డు లో 854 మంది, పుర ప్రజలు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పరీక్షించి సూచనలు చేసి అవసరమైన మందులు ఇవ్వడం జరిగింది. . ఈ కార్యక్రమంలో కె. జరూష (Medical Officer) యస్.కిరణ్ కుమార్ (orthopedic), యం.డి.రఫీయుద్దీన్ (Medical Officer), జి. శశికాంత్ (Medical Officer), రాజేష్ రెడ్డి M.D(General), యస్. కృష్ణదుర్గ (Medical Officer), పి. మౌర్యచం M.S(General), కె.రెండనాయడుమున్సిపల్ కమీషనర్, శ్రీమతి యం. శ్యామల, వైసిపి నేతలు తోట భోగయ్య గారు, నల్లం రాంబాబు, కోడే యుగంధర్ , గుంటి ప్రభు, తదితరులతో పాటు అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
