సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో దసరా వేడుకలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గునుపూడి పంచా రామం, శ్రీ భేమేశ్వర దేవాలయం, దిరుసుమర్రు రోడ్డులోని శ్రీ దుర్గ లక్ష్మి ఆలయం, త్యాగరాజ భవనం లోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయం, పెదమిరం లోని శ్రీ స్వర్ణ సాయి బాబా వారి మందిరం వద్ద అత్యంత వైభవంగా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ దేవి అవతారాలలో పాటు ఆలయ ఆవరణలో వేసిన భారీ టెంట్ పందిళ్లు , కుంకుమ పూజలు, ప్రసాద వితరణలు, బుర్రకథలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తో పాటు నవరాత్రుల నేపథ్యంలో అందమైన లైటింగ్ అలంకరణలు తో వేదికపై ప్రఖ్యాత కళాకారిణులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో మరో ప్రక్క ఎంతో దూరప్రాంతాల నుండే వాహనాలలో వచ్చే భక్తులు హడావుడి పరుగులు తో ఆధ్యాత్మిక దసరా శోభ కళకళ లాడుతుంది.
