సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: వచ్చె నెల 8 వ తేదీన విద్యార్ది , యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాలు వచ్చే నవంబర్ 8 కి 1000 రోజులకు చేరువైన నేపథ్యంలో మరియు , కడప లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా సంస్థల బంద్ ను జిల్లాలో జయప్రదం చేయాలని.. ఏ ఐ ఎస్ ఎఫ్ , ఎస్ ఎఫ్ ఐ , పి డి యస్ యు , ఏ ఐ వై ఎఫ్ ,డి వై ఎఫ్ ఐ సంఘాలు పిలుపునిచ్చాయి ఈ మేరకు నేడు, శుక్రవారం భీమవరంలో అర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ కార్యలయం నందు బంద్ ను జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సి హెచ్ సుందర్ అధ్యక్షతన జరిగింది . ఈ బంద్ కు జిల్లాలోని అన్ని ప్రయివేటు కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులు సంగీబావం తెలపాలని వారు కోరారు , ఈ సమావేశం లో పి డి యస్ యు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి సి హెచ్ నాగరాజు ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు గంటా పవన్ , అర్ మనిదీప్ ,ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు పి వాసు ,తదితరులు పాల్గొన్నారు
