సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యం లో కొత్తవలస మండలం భీమాలి వద్ద ప్రమాద బోగీలు తొలగించి ట్రాక్ సరిచేసే పనులు 7బృందాలతో ( ఫై తాజా చిత్రంలో చూడవచ్చు) శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి యధాతధంగా రైళ్లు నడుస్తాయి. నేడు, సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేఅధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రత్నాచల్, సింహాద్రి, ఎం జీఆర్ చెన్నై సెం ట్రల్-పూరీ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. రద్దయిన రైళ్ల వివరాలు ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా నడిచే .. 12718 – విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ ప్రెస్. 12717 – విశాఖపట్నం – విజయవాడ రత్నాచల్ ఎక్స్ ప్రెస్, 17239 – గుంటూరు – విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ ప్రెస్ 17244 – రాయగడ – గుంటూరు ఎక్స్ ప్రెస్ 17240 – విశాఖపట్నం – గుంటూరు ఎక్స్ ప్రెస్ (ఇవాళ, రేపు రద్దు) 08584 – తిరుపతి – విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసారు.
