సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వచ్చే ఎన్నికలలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరుపార్టీల కార్యాచరణలో భాగంగా ఉమ్మడి కార్యచరణ పైచర్చలు జరపడం జరిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజలకు విముక్తి కలిగించాలని, భవిష్యత్తులో ఉమ్మడి ప్రజా పోరాటాలు, ప్రతి ఇంటికి ఉమ్మడి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు అరెస్టు, వారాహి యాత్రకు అడ్డంకులు నిలవరించడం కోసం చర్చించడం జరిగింది.. ఏలూరులో నేడు, సోమవారం ఏర్పాటైన సమావేశంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, టీడీపీ జిల్లా అడ్జక్షురాలు తోట సీతారామలక్ష్మి తో పాటు భీమవరం నుండి జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, కొటికలపూడి గోవిందరావు , PAC సభ్యులు, వేగేశ్న కనకరాజు సూరి , మళ్ళినీడి బాబీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ , ఉండి నియోజక వర్గం ఇంచార్జ్ శ్రీ జుత్తుగ నాగరాజు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గవర లక్ష్మి ,తాడేపల్లి గూడెం ఇంచార్జ్ బోలిశెట్టి శ్రీనువాస్, ఉంగుటూరు నియోజక వర్గం ఇంచార్జ్, పత్సమట్ల ధర్మరాజు , జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి , భీమవరం నియోజక వర్గం, వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్, ఘంటసాల వెంకట లక్ష్మి, చెనమల్ల చంద్రశేఖర్ ఉమ్మడి జిల్లా నాయకులు, నియోజకవర్గాల ఇంచార్జ్లు తదితరులు.. ఈ సమావేశంలో పాల్గొన్నారు.
