సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో నేడు, మంగళవారం కొంత ఊరట లభించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 73 ఏళ్ళ చంద్రబాబుకు హైకోర్టు అనారోగ్య కారణాలు చూపటం దృష్ట్యా..ఆయన తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స పొంది కేవలం ఇంటివద్ద మాత్రమే విశ్రాంతి తీసుకొనేందుకు నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ లో అనుమతి ఇచ్చింది. ఈ బెయిల్ కేవలం స్కిల్ స్కాం కేసు కు మాత్రమే వర్తిస్తుంది. ఈ 4వారలు కాలంలో ఆయన ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు లో పాల్గొనడం కానీ సాక్షులను బెదిరించే పనులు కానీ చెయ్యకూడదని షరతులు ఉన్నాయి.
