సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుండి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ చట్టం అమలు లో ఉంటుందని భీమవరంలోని తన కార్యాలయంలో జిల్లా ఎస్పి, రవి ప్రకాష్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో స్థానిక పోలీస్ స్టేషనులో అనుమతి లేకుండా ఎవరు సభలు, సమావేశాలు , ర్యాలీలు నిర్వహించకూడదని వీటిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఆలాగే గత ఆదివారం భీమవరం పట్టణంలోని నర్సయ్య అగ్రహారంలో సీఐ అడబాల శ్రీను జరిపిన పోలీస్ దాడిలో పేకాడుతూ 8 మంది జూదరులతో పాటు పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ బి. విజయకుమార్ ను ఎస్పీ యు రవిప్రకాష్ సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ బండారు శ్రీనాధ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *