సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన తర్వాత సహాయక చర్య లు, బాధితుల చికిత్స విషయంలో వెంటనే సీఎం జగన్ బాధితులను హాస్పటల్ లో పరామర్శించి వారి గాయాలకు పడుతున్న బాధలకు చలించిపోయి వారికీ భోరోసా ఇవ్వడంతో పాటు మంత్రి బొత్స ను వారికీ సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. బాధితులకు మానవత్వంతో ఆర్థిక సాయం మరింత పరిహారం పెంచి.. అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. తాజాగా నేడు, మంగళవారం ఆ పరిహారం బాధితులకు అందింది. బాధితులకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ప్రభుత్వ ఆస్పత్రి లోనే నష్టపరిహారం చెక్లు అందజేశారు. ప్రమాదంలో మరణించిన13 మంది వ్యక్తుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున.. రూ.1కోటి కోట్ల 30 లక్షలు అందచేశారు. తీవ్రంగా గాయపడిన 10 మందికి రూ. 5లక్షలు, ముగ్గురుకి రూ. 10లక్షలు, మిగతా వారికి రూ. 2 లక్షలు చొప్పు న.. మొత్తం క్షతగాత్రులకు కోటి 32 లక్షలు అందచేసింది ఏపీ ప్రభుత్వం .మొత్తం మీద బాధితులకు రూ. 2 కోట్ల 62 లక్షలు అందచేశారు
