సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ చాలా తగ్గింది. భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను ఎక్కడా ఆగకుండానే నేరుగా అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి గంట లోపే సమయం పడుతోంది. దీనితో భక్తులు సంతోషంగా పలు దర్శనాలు చేసుకొని నిలువెత్తు శ్రీవారిని ఆసాంతం తదేకంగా వీక్షించే అదృష్టం వరించింది. గత మంగళవారం శ్రీవారిని 62,269 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
