సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అందాల సాగర తీరం తో ఆధునిక నగరం విశాఖ రాజధానిగా సీఎం జగన్ అతిత్వరలో రుషికొండపై నిర్మించిన సరికొత్త నిర్మాణాల నుండి రాష్ట్ర పాలన కు సిద్ధం అవుతున్నా నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అమరావతి నుండే పాలన ఉండాలని అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. దానిపై నేడు, శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈకేసు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై సుప్రీం ధర్మాసనం పిటీషనర్ కు సూచన చేస్తూ.. ఇప్పటికే హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని ప్రకటించింది. పిటీషన్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని సుప్రీం కోర్ట్ నొక్కి చెప్పడం విశేషం. దీనిపై హైకోర్టు పరిధిలోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పు తో వైసిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
