సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేసి తీరతామని ప్రకటించిన వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల, తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తాజగా నేడు, శుక్రవారం ప్రకటించడం ..ఉన్నంతలో షర్మిల గౌరవంగా తప్పుకోవడం సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమను సీట్లు తేల్చకుండా దూరంగా పెట్టటంతో పొత్తు లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న షర్మిల ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుత ఎన్నికలలో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల మళ్లీ ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందన్నారు. పాలేరు విషయంలో షర్మిల బావోద్వేగానికి గురయ్యారు. కన్నీటితో ప్రజలకు వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఎవరైనా బాధ పడితే మన్నించాలని వేడుకున్నారు. పాలేరులో తాను చేసిన ప్రతి పోరాటంలో పొంగులేటి శ్రీను అన్న తన వెంట ఉన్నారన్నారు. . ఇప్పుడు శ్రీను అన్న కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నారు కాబట్టి తానేం చేయాలో ప్రజలే తనకు చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *