సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తనకు ఇచ్చిన మాట ప్రకారం…చంద్రబాబు ఎన్నికల వేళా టీడీపీ అభ్యర్థులను పోటీలో దింపకుండా తనను, బలమైన తెలంగాణ టీడీపీ క్యాడర్ ను గాలికి వదిలేశారని , ఇక లోకేష్’ అయితే ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఎత్తకుండా దొరతనం చూపించాడని.. స్వంత డబ్బు తో పాటు పార్టీని బలోపేతం చెయ్యడానికి తాను పడిన కష్టం వృధా అయ్యిందని విలపిస్తూ.. ఎన్నికలలో పోటీ చెయ్యని పార్టీకి తాను అడ్జక్షునిగా ఉండలేనని రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నేడు, శుక్రవారం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం నాడు రాజశ్యామల యాగం లో పాల్గొన్న సీఎం కేసీఆర్ సమక్ష్యంలో జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ జ్ఞానేశ్వర్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ్ఞానేశ్వర్‌తో పాటు ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక పదవీ ఇస్తానని కాసాని జ్ఞానేశ్వర్‌కు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,‘‘ముదిరాజ్ సామాజిక వర్గంలో నాయకత్వం ఎదగాలి. గెలిచే నాయకులను పార్టీ గౌరవిస్తుంది.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలోంచి వెళ్లాక.. పార్టీలోకి వచ్చిన పెద్ద BC నేత మీరు.. పార్టీలో మీకు తగిన గౌరవం ఉంటుంది. ఎన్నికలు అయిపోయాక ప్రశాంతంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత తెలంగాణ టీడీపీ అడ్జక్షడు రమణ కూడా చేరిపోయి ఎమ్మెల్సీ పదవి తో సరిపెట్టుకోవడం గమనార్హం..
