సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ నగరంలో ఊహించని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేడు, సోమవారం ఉదయం స్థానిక పండిట్ నెహ్రూ బస్టాండ్‌ లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లింది. ఇక ప్లాట్ పామ్ అంతటా ప్రయాణికుల రక్తపు మరకలే..ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన మెట్రో లగ్జరీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫ్లాట్ ఫాంపైకి దూసుకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఒక మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్ఘటన ఫై సీఎం జగన్ స్వాందిస్తూ గాయపడిన వారికీ తక్షణ వైద్య చికిత్స తో పాటు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రభుత్వ సాయం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *