సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నేడు,శనివారం జరుగుతున్నా సామాజిక సాధికార బస్సుయాత్ర పురస్కరించుకొని స్థానిక నెక్ పంక్షన్ హాలులో వైసిపి కీలక నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలలో సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతం అయ్యిందని, బిసి, ఎస్ సి, ఎస్టీ వర్గాలకు కూడా అగ్ర వర్గాలకు దీటుగా సమప్రాధాన్యత ఇస్తున్న విషయం.. అన్ని వర్గాలలో కూడా పేదలను ఆదుకొంటున్న తీరు ప్రజలలోకి లోకి బాగా వెళ్లిందన్నారు. ప్రజలలో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటు లేదనిఅన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
