సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మరియు భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ.. నేడు, శుక్రవారం భీమవరం పట్టణం 17 వ వార్డు ysrcp వార్డు ఇంఛార్జి రెడ్డి సత్తిబాబు తో పాటు భీమవరం నాయి బ్రాహ్మణా సేవా సంఘం &ysrcp నాయకులు తుంపాల శ్రీనివాస్ వారి అనుచరులతో సుమారు 100 మంది పైగా మా జనసేన పార్టీలో చేరారని ప్రకటించారు. అక్కడ చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పారు.. ఈ సందర్భముగా చినబాబు మాట్లాడుతూ.. పేదవాడి జీవితాల్లో అభివృద్ధి కేవలం జనసేన పార్టీతోనే సాధ్యమని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. భీమవరంలో అభివృద్ధి అనేది కనుచూపుమేరలో ఎక్కడా కానరావడం లేదన్నారు. ఎమ్మెల్యే గ్రంధికి తన కొత్త ఇంటి అభివృద్ధి పై ఉన్న శ్రద్ధ భీమవరంపై పెట్టుంటే బాగుండేదన్నారు. పట్టణంలో రోడ్లు నిర్మించడం చేతకాదుగానీ తన యింటికి మాత్రం రోడ్లు సౌకర్యం బాగానే కల్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు పట్టణంలో చేసిన అభివృద్ధిపై, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పనులపై చర్చకు సిద్దమన్నారు. అన్ని వార్డులలోకి వెళ్ళి అభివృద్ధి పై చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,చనమల చంద్రశేఖర్, సుంకర రవి, బండి రమేష్ కుమార్, వానపల్లి సూరిబాబు, మాగాపు ప్రసాద్,కట్రేడ్డి రాము, కాళీ శేకర్, అప్పారావు, రామాయణం శ్రీనివాస్, ఆరుగొలను పద్మ ,బండారు శ్యామల, ప్రవల్లిక, పూర్ణిమా, ప్రతిభ, మాలి, ఇందిరా,పద్మారావు, త్రివిక్రమ్, ఉండవల్లి శ్రీను, తదితర నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
