సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 58 వ వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో దూరప్రాంతాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొని ఉత్సవాల వేడుకలను తిలకిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాల తరువాత లోకల్ భక్తులు కూడా ఎక్కువ కావడంతో ఆలయ ఆవరణ భారీ సెటింగ్స్, లైటింగ్ అలంకారణాలు నాటక కళా ప్రదర్శనలతో ప్రతి సాయంత్రం ఎంతో సందడిగా ఉంటుంది. ఇటీవల రాత్రి 11 గంటల నుండి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో గతంలోలాగా రాత్రి 9గంటల నుండి కాకుండా నాటక ప్రదర్శనలు సాయంత్రం 6 గంటల నుండి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది నాటకాలు చూసే అవకాసమ్ ఏర్పడింది. సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటల నుండే ప్రారంభిస్తున్నారు. కళాకారులూ చక్కటి ప్రతిభ చూపుతున్నారు. నిన్నటి షిర్డీ సాయి బాబా ,మహిమ, నేడు గురువారం సాయంత్రం ప్రదర్శించిన ‘ శ్రీ కృష్ణ ఆంజనేయ యుద్ధం నాటకం ఆహుతులను చక్కగా అలరిస్తుంది.( పైన తాజా చిత్రం) రేపు, శుక్రవారం సాయంత్రం 6గంటల నుండి అల్లూరి సీతారామ రాజు నాటక ప్రదర్శన ఉన్నట్లు ఉత్సవకమిటీ, నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఒక ప్రకటనలో తెలియజేసారు.
