సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు కు చెందిన నటి త్రిషపై అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు,రాజకీయనేత, మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ? అక్కడ కూషుబు, తెలుగు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి మన్సూర్ వ్యాఖ్యలపై? అభ్యన్తరం వ్యక్తం చేసి తాము త్రిష కు అండగా ఉంటానని పెద్ద మనస్సు చాటుకోవడం తెలిసిందే. అయితే తాజా తమిళ వార్త సమాచారం మేరకు.. తాను అనని మాటలు అన్నానని తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించా రంటూ.. త్రిష, ఖుష్బూ పై చెరో 10 కోట్ల రూపాయలకు.. చిరంజీవిపై ఏకంగా 20 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ను ప్రముఖ లాయర్ గురు ధనంజయ్ ద్వారా వేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు మన్సూర్. చిరంజీవి, ఈ వివాదానికి సంబంధించి తనకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేసి వివరాలు తెలుసుకోకుండా తనను దోషిని చేసారని ఆరోపించారు. తన ఆత్మ సాక్షిగా, తను వృత్తిపై ప్రమాణం చేస్తూ ఈ మాట చెబుతున్నానని, పరువు నష్టం సొమ్ము మొత్తం రాగానే పేదలకు పంచిపెడతానని అన్నాడు. ఈ సందర్భంగా చిరంజీవిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి ప్రతి ఏడాది తనతో నటించిన పాత హీరోయిన్ లకి మంచి పార్టీలు ఇస్తాడని వ్యాఖ్యానించారు, చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి, వేల కోట్లు మింగేసి పేదలకు ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు. ఆయన తమ్ముడు,పవన్ కూడా పార్టీ పెట్టాడని, అయితే పవన్ ను తను ఎప్పుడూ కల్వలేదన్నాడు.
