సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు అదనపు జిల్లా కోర్టు మంజూరు అయ్యిందని తాజా సమాచారం. ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా విభజన అనంతరం తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేసేలా స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి, కొట్టు సత్యనారాయణ చేసిన కృషి ఫలించింది. దీంతో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఇటీవల తాడేపల్లిగూడెం పట్టణానికి రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. దీంతో ఇంతవరకు కేవలం మున్సిపాలిటీ స్థాయికి పరిమితమైన తాడేపల్లిగూడెం నేడు డివిజన్ స్థాయితో పాటు న్యాయపరంగానూ అదనపు జిల్లా కోర్టు మంజూరు హర్షణీయం…
