సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సబ్దు గా తెలుగు దేశం పార్టీ క్యాడర్ లో జోష్ పెంచేందుకు, సీఎం జగన్ పాలన ఫై విమర్శలు కురిపిస్తూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనేక విరామాలు దాటి ఎట్టకేలకు పూర్తీ చేస్తున్నారు. నేడు, సోమవారం గ్రేటర్ విశాఖ, శివాజీనగర్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యువగళం సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు అవుతున్నారు అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. గత రాత్రి హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు యువగళం ముగింపు సభకు హాజరు కావాలని స్వయంగా పవన్ ను కోరారు. అయితే పని వత్తిడి వలన యువగళం కు రాలేక పోతున్నానని తొలుత చెప్పిన పవన్ కళ్యాణ్.. చివరకు చంద్రబాబు ఆహ్వానంతో వస్తానని హామీ ఇచ్చారు.
