సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలోని అన్ని వైష్ణవ దేవాలయాలలో దేవేరులతో శ్రీవారిని దర్శించేందుకు ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాట్లు చెయ్యడం భక్తులు విశేషంగా తెల్లవారు జామునుండి దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యముగా జేపీ రోడ్డులోని, హోసింగ్ బోర్డు లోని శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర దేవాలయాలలోను, 20వ వార్డులోని శ్రీ వెంకటేశ్వర మందిర్ లోను, కాళ్ళకూరు లోని స్వయం భూ శ్రీ వెంకటేశ్వర స్మామి దేవాలయంలలో భారీ క్యూ లైన్ లలో వేలాది భక్తులు తెల్లవారు జామునుండి నిలబడి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎడతెరపి లేకుండా శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. భారీ ప్రసాద వితరణలు ఇతర సౌకర్యాలు భక్తులకు కల్పించారు.అన్ని దేవాలయాల వద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాట్లు చేసారు. హోసింగ్ బోర్డు దేవాలయంలో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు స్వామివారిని దర్శించుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *