సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ని ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో నేడు, శనివారం మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా 31వ మహా సభను వందలాది ప్రతినిదుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ.. కల్లు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని కల్లు గీత వృతి ఫై ఆధారపడే శ్రామికుల కుటుంబాలకు భరోసా , రక్షణ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చెప్పట్టాలని డిమాండ్ చేసారు. పెరిగిపోతున్న ఆధునీకరణ నేపథ్యంలో కల్లు ఉత్పతులు కూడా ఆధునిక శైలిలో మార్కెటింగ్ చేసే దిశగా ఆలోచనలు ఉండాలని.. గతం తో పోలిస్తే మంచి ఫలితాలు సాదిస్తున్నామని ఇదే ఐక్యత తో పనిచేస్తే మునుముందు కల్లు గీత కార్మికుల కుటుంబాలకు మరింత గౌరవంతో పాటు సమాజంలో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేసారు.
