సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో రేపు శుక్రవారం ఉదయం సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీఎం పర్యటించే ప్రాంతాలలో రోడ్లను అధికారులు పరిశీలించారు. ఇక్కడే భీమవరం ప్రయాణికులకు అనుకోని విధంగా అదనపు మేలు జరిగింది. భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రోద్భలంతో.. మునిసిపల్ ప్రత్యేక అధికారులు సహకారంతో పలు సీసీ రోడ్డులు రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ 90 కోట్ల పైగా నిధులతో వేశారుకాని విజయలక్ష్మి థియేటర్స్ దగ్గర టీపీ గూడెం రోడ్డు వైపు 20 కోట్ల రూపాయలు పైగా రైల్వే శాఖ కేంద్ర నిధులతో ఆధునికంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రీజ్ కి అనుబంధంగా (డిమార్ట్ వైపు ) సుమారు 200 మీటర్లు రోడ్డు ను మాత్రం కలపకుండా వదిలివేశారు. ఈ అప్రోచ్ రోడ్డు వెయ్యాలని గత ఏడాదిగా పలుమారులు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక మునిసిపల్ అధికారులను, ఆర్ & బి అధికారులను ఆదేశించినప్పటికీ.. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ప్రధాన రోడ్డును కలిపే కీలక అప్రోచ్ రోడ్డును పెండింగ్ లో పెట్టేసారు.. అక్కడ కాస్త మట్టి వేసి సరిచేసి వదిలేస్తే మరల వర్షానికి భారీ గుంతలలో వాహనదారులను ఆ ప్రాంతం తీవ్ర ఇబ్బంది గా ప్రమాద భరితంగా ఉండేది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులలో కదలిక వచ్చింది. గ్రావెల్ వచ్చింది. బుల్డోజర్స్ కదిలాయి. ఆగమేఘాలపై కొత్త అప్రోచ్ రోడ్డు వచ్చేసింది. అయితే సీఎం పర్యటన ముగిసాక కాస్త తారు వేసి మరింత క్వాలిటీ పెంచవలసి ఉంది. మొత్తానికి వేలాది మంది ప్రయాణికులకు రోజువారీ ఇబ్బంది తొలగింది. మరి సీఎం వస్తున్నారంటే.. మజాకానా?
