సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, శుక్రవారం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పిరియాడికల్ స్పై థిల్లర్’ ‘డెవిల్ ‘ సినిమా పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు నేడు, శుక్రవారం వచ్చింది. ఇందులో నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త, మాళవిక నాయర్, సీత, సత్య ,శ్రీకాంత్ అయ్యంగార్,, అజయ్, షఫి తదితరులు; నటించగా ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మించింది. కథ,కధనం, మాటలు: శ్రీకాంత్ విస్సా అందించారు. మరి ఈ సినిమా కధ విషయానికి వస్తే..1940 దశకంలో బ్రిటిష్ పాలనలో జరిగే కల్పిత కథ ఇది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ ను పట్టుకోవాలనే ప్రయత్నంలో బ్రిటిష్ వారికీ బోస్ రాక గురించి సమాచారం అందుతుంది. బ్రిటిష్ వారి సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు డెవిల్ (కళ్యాణ్ రామ్ ).రసపురంలోని జమిందార్ ఇంట్లో జరిగిన ఓ హత్య కేసుని ఛేదించడానికి వెళ్లిన డెవిల్ ఆ హత్య కేసులో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో నడుస్తున్న ఐఎన్ఏ ఏజెంట్ల పాత్రను గుర్తిస్తాడు మరోవైపు, బోస్.. వారు తన కుడి భుజమైన త్రివర్ణ ను ఏజెంట్ గా వాడుకొంటున్న విషయాన్ని ఆమెకు జమిందార్ హత్య గురించి ఒక కోడ్ పంపిన డెవిల్ పసిగడతాడు ఇంతకీ నిందితులను బ్రిటిష్ ప్రభుత్వం నికి డెవిల్ పట్టి ఇచ్చాడా? అన్నది తెరపై చూడవలసిందే.. సినిమా ఎలా తీశారంటే.. నిజంగా డిఫరెంట్ జోన్లో తీశారు. దేశభక్తి.. సస్పెన్సు, అనూహ్యమైన మలుపులు, ఉత్కం ఠ సన్నివేశాలు చక్కగా తీశారు, అయితే మధ్య లో పాటలు ఇబ్బంది పెట్టిన , ప్రేమ కోణంతో ప్రథమార్ధం దాదాపుగా ముగుస్తుంది. ఆకాలం నాటి వాతావరణం , దుస్తులు, వస్తువులు , సెట్స్ ఫై దర్శకుడు బాగా శ్రద్ద పెట్టాడు. అక్కడక్కడా పండిన భావోద్వే గాలు సినిమాకి కలిసొచ్చే అంశాలు.. హీరోగా.. డెవిల్ కళ్యాణ్ రామ్ చక్కగా నటించాడు. సంయుక్త పాత్రకు పెద్ద బలంలేదు. శాస్త్రి పాత్రలో సత్య , కీలకమైన మలుపునిచ్చే పాత్రలో వశిష్ట సింహా, షఫి,బాగా చేసారు. సినిమా రిచ్ గా ఉంది. ఒక కొత్త తరహా సినిమా చుసిన తృపి ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే భారీ అంచనాలతో వెళ్ళితే మాత్రం..
