సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది కి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది.. జనవరి నెల నుండి వృద్దులకు జగన్ సర్కార్ పెంక్షన్ 3000 రూపాయలు నెలవారీ ఇస్త్తున్న నేపథ్యంలో ఈ వైయస్సార్ పెన్షన్ ఈ నెలలో ఈ నెల 4వ తేదీ నుండి పంపిణి ప్రారంభిస్తామని స్థానిక మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా 04-01-2023 వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమము ప్రారంభిస్తారు. కావున ముందు రోజు అనగా 03-01-2023వ తేదీన వార్డు సచివాలయం ఖాతాల కు అమౌంట్ జమా అవుతుంది... కాబట్టి సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల ఈ విషయం పెన్షన్ దారులకు తెలియజేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *