సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో న్యూ ఇయర్ వేడుకలు తగిన జాగ్రత్తలతో జరుగుపుకొంటే మంచిది. కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 841 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇవి గత 227 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో కేరళ, కర్ణాటక, బీహార్‌లలో ఒక్కొక్కటి చొప్పున మూడు మరణాలు నమోదయ్యాయని నేడు, ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేరళలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో కోవిద్ కేసులు అత్యల్పంగా ఉన్నపటికీ నేటి ఆదివారం బాపట్ల సమీపంలోని కొరిశపాడు గ్రామంలో లో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు. దీంతో పాజిటీవ్ వచ్చిన 6గురికి చికిత్స అందిస్తున్నారు. మిగతావారి శాంపిల్స్ సేకరించి ఒంగోలు రిమ్స్‌కు పంపించారు. ఒకేసారి ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురిఅయ్యారు.
