సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ , త్రివిక్రమ్ శ్రీనివాస్, వంటి ఎందరో సినీ దర్శకులు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటారు. మరి ఎప్పటికైనా దేశాన్ని షేక్ చేసే సినిమాలు తీసే దమ్మున్న ప్రతిభావంతమైన యువ దర్శకుడిగా ఎదుగుతున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంవహించిన పాన్ ఇండియా సినిమా ‘హనుమాన్’ సినిమా ఫై దాని సాంకేతిక విజువల్స్ నిర్మాణంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రిలీజ్ కాస్త వాయిదాలు పడినప్పటికీ వచ్చే సంక్రాంతి కి 4గురు అగ్ర హీరోల మధ్య సూపర్ మాన్.. హనుమాన్’ ను బరిలోకి దింపుతున్నారు.. మరి సంక్రాంతి చిత్రాల పోటీపై దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో సంక్రాంతికి బిజినెస్ బాగా జరుగుతుంది. ఈ సమయంలో సాధారణం గా మూడు సినిమాలు విడుదలవుతాయి. ఈసారి మాత్రం దాదాపు ఐదు చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో ‘గుంటూరు కారం’ తో పోటీగా ‘హనుమాన్’జనవరి 12న విడుదల అవుతుంది. దీంతో మా సినిమా విడుదలను వాయిదా వేయాలని పలువురు అడిగారు. మహేష్ బాబు, త్రివ్రిక్రమ్ అంటే నాకు చాల అభిమానం.. నిజమే.. అయితే హిందీ మార్కెట్ ఇప్పుడు మాకెంతో ముఖ్యం. నార్త్లో మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్లు..ఈ సినిమాపై మా కంటే వాళ్లకే ఎక్కువ నమ్మకం ఉంది. రిలీజ్ వాయిదాకు వాళ్లు అంగీకరించలేదు. అందుకే మేము అనుకున్న తేదీకే విడుదల చేస్తున్నాం ’’ అని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *