సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరంలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలకు రంగం సిద్ధం అయ్యింది. నేటి ఆదివారం సాయంత్రం నుండి రెస్టారెంట్స్, బేకరీలు , స్వీట్స్ షాపులలో కోలాహలం.. ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా ఆయా షాపుల దగ్గర కేక్స్ , బిర్యానీలు , కూల్ డ్రింక్స్ ఆఫర్స్ వెలువ తో ఫ్లెక్సీ ల సందడి అలంకరణలు, పండ్లు, పూలబొకేల స్టాల్స్ ఏర్పాటు చేసారు. కొన్ని సంఘాలు,విద్య సంస్థలలో ఆధ్వర్యంలో నేటి రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలు సందడి షూరూ కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ వేడుకలు చేసుకొనేవారిని ఉద్దేశించి .. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున వేడుకలు నిర్వహిం చుకునేవారు తప్పనిసరిగా సబ్ డివిజన్ పోలీసు అధికారుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, అర్ధరాత్రి 1 గంటలోపే వేడుకలు ముగించాలని స్ప ష్టం చేశారు. ప్రధాన రహదారులు, పబ్లిక్ స్థలాల్లోవేడుకల నిర్వహణకు అనుమతి లేదన్నారు. అలాగే యువత గుంపులుగా తిరగకూడదని వేడుకల్లోబాణసంచా కాల్చడం నిషేధించామని, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, ఆలా నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చు కోవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారిపై చర్య లు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మద్యం దుకాణాలు, బార్లను నిర్దేశించిన సమయం లోగా మూసివేయాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృ ష్టి పెట్టాలని హితవు పలికారు.
