సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో బాలోత్సవం రెండో రోజు కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి స్మరణ ను డిగ్రీ కళాశాల గతకాలపు ప్రిన్సిపాల్ ఎస్వీ రమణారావు ఆవిష్కరించారు సభలో ఆయన మాట్లాడుతూ.. భీమవరం ప్రాంతంలో అల్లూరి సీతారామ రాజు వంటి స్వతంత్ర సమర యోధులతో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు, పద్మభూషణ్ లు స్వామి జ్ఞానానంద, అయ్యగారి సాంబశివరావు , ఎల్లాప్రగడ సుబ్బారావు వంటి వారు జన్మించి ప్రపంచానికి దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. అటువంటి వారి ప్రేరణ బాలోత్సవంలలో బాలలకు అందించాలన్నారు. జిపిసి శేఖర్ రాజు ఆధ్వర్యంలో రోప్ స్కిప్పింగ్ ప్రదర్శన నిర్వహించారు అనంతరం మ్యాజిక్, మ్యూజిక్ షోలు అక్కడికి వచ్చిన బాల లందరిని అలరించాయి .సంగీత విద్వాంసుడు ,గాయకుడు పిప్పళ్ళ ప్రసాద్ రఘుపతి రాఘవ రాజారం.. పతీత పావన సీతారాం అంటూ మహాత్మా గాంధి వారి స్వాతంత్ర్య సమర గేయాన్ని ఆలపించారు మ్యాజిక్ స్టార్ దంతులూరి బోసు మ్యాజిక్ షోలో సిద్ధార్థుడు బుద్ధుడిగా ఎలా రూపాంతరం చెందాడు మ్యాజిక్ ద్వారా తెలియజేశారు.పలు పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెమేంటోలు ప్రశంసా పత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వి రమణారావు తదితరులు అందించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది బాల బాలికలతో పాటు బాలోత్సవం అధ్యక్షులు ఇందుకూరి ప్రసాదరాజు, కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామయ్య ,గుండె వైద్య నిపుణులు డాక్టర్ బత్తిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
